క్రేజీ హీరోయిన్ సమంత తో కలిసి ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ లవ్ స్టోరీ "ఖుషి" లో నటిస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. గతేడాది శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విజయ్ "లైగర్" కారణంగా కాస్తంత బ్రేక్ తీసుకుంది. ఆపై సమంత అనారోగ్యం కారణంగా బిగ్ బ్రేక్ తీసుకుంది.
సమంత కోలుకోవడంతో ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 1, 2023న పాన్ ఇండియా భాషల్లో ఖుషి విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ పోస్టర్ చూడటానికి ఎంతో క్యూట్ గా ఉంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో ఔటండౌట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.