టీవీ చానల్స్ నుంచి హరితేజకు అవకాశాలు

  Written by : Suryaa Desk Updated: Wed, Oct 11, 2017, 02:59 PM
 

ఈటీవీలో ప్రసారమవుతోన్న మల్లెమాల వారి 'జబర్దస్త్' కార్యక్రమానికి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. చాలాకాలం నుంచి ఈ కార్యక్రమం మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ గా రష్మీ వ్యవహరిస్తోంది. త్వరలో ఈ ప్లేస్ లో హరితేజ కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.


ఇటీవల 'స్టార్ మా'లో ప్రసారమైన 'బిగ్ బాస్' షో ద్వారా హరితేజ బాగా పాప్యులర్ అయింది. ఆమె అందరి మనసులను ఎక్కువగా దోచుకున్న కారణంగా, ఆమెను రష్మీ ప్లేస్ లోకి తీసుకోవాలనే నిర్ణయానికి నిర్వాహకులు వచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే రష్మీ ని తప్పించడం లేదు .. ఆమెనే తప్పుకుంటోందనే టాక్ కూడా వినిపిస్తోంది. 'బిగ్ బాస్' సెకండ్ సీజన్ లో పాల్గొనబోయేవారి జాబితాలో రష్మీ పేరు కూడా ఉందట. అందువలన రష్మీ కి కొంత గ్యాప్ రానుంది. అందుకే హరితేజను తీసుకోనున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
Recent Post