ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరు గెలిచారు...లక్ష్మిస్ ఎన్టీఆర్ v/s మహానాయకుడు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 04:31 PM



ఓడలు బళ్ళు.. బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఒకవైపు.. అదే సందర్భంలో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటన. అంచనాలు మాత్రం క్రిష్ చిత్రంపైనే. కాని వర్మ అభిమానులకు మాత్రం ఏదో ఒక మూల ఆయన గట్టిగా కొడతాడనే నమ్మకం మాత్రం ఉండనే ఉంది. అయితే తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్‌లో వారి నమ్మకాన్ని వమ్ముచేయలేదు వర్మ.

ఇక మహానాయకుడుతో పోలికల విషయంలో సైతం వర్మ ఎక్కడా తగ్గడం లేదు నిన్న ఏకంగా తన ట్విట్టర్ లో ఏ సినిమా ఎక్కువ నిజాయితిగా నిజాలతో ఉంటుంది అనే ప్రశ్న ఇచ్చి మహానాయకుడు లక్స్మిస్ ఎన్టీఆర్ అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి భారీగా  41 వేల 734 మంది ఓట్ల రూపంలో స్పందించారు. 690 రీ ట్వీట్లు పడ్డాయి. ఏకంగా 4 వేలకు పైగా లైకులు కొట్టేసారు. ఇంతకీ విజేత ఎవరు అనుకుంటున్నారా. ఇంకెవరు. లక్ష్మీస్ ఎన్టీఆరే. 85 శాతం ఓట్లు దీనికే రాగా మహానాయకుడు కేవలం 15 శాతం ఓట్లతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్ అని నందమూరి ఫ్యాన్స్ కొట్టెయవచ్చు. కాని ట్విట్టర్ అనేది పబ్లిక్ ప్లాట్ ఫారం. కేవలం వర్మ అభిమానులు మాత్రమే అతనికి అనుకూలంగా స్పందిస్తారు అనుకోవడానికి లేదు. ఎవరైనా ఓటు వేయొచ్చు. ఆ లెక్కన చూసుకుంటే ప్రేక్షకుల్లో లక్మిస్ ఎన్టీఆర్ మీద ఆసక్తి తేటతెల్లమవుతోంది. కామెంట్లు సైతం అలాగే వచ్చాయి. సూర్యుడు విద్యుత్ బల్బులో ఏది వేడిది అని అడిగితే ఎలా అంటూ మంచి కామెడీనే చేసారు


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com