తమిళ సీనియర్ హీరో అరుణ్ పాండ్యన్ కుమార్తె కీర్తి పాండ్యన్ కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నది. హరీష్ రామ్ దర్శకత్వంలో ‘దర్శన్’ జోడీగా ఓ యాక్షన్ సినిమాలో ఆమె నటించనుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో అరుణ్ పాండ్యన్ కూడా నటిస్తున్నాడు.. ఇప్పటికే తమిళ నాడులో మేనక కుమార్తె కీర్తి సురేష్, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ ఇప్పటికే దక్షిణాది లో రాణిస్తున్నారు.