ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున మేనకోడలిని పెళ్లాడబోతున్న అడవి శేష్ ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 06:48 PM



హ్యాండ్సమ్ హీరో అడవి శేష్‌కి అక్కినేని వారమ్మాయికి పెళ్లని వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో బాగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ నెల తరువాత తానో పెద్ద అనౌన్స్‌మెంట్ చేయబోతున్నానంటూ అడవి శేష్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లంతా అడవి శేష్ పెళ్లి వార్త చెప్పబోతున్నాడంటూ ఊహాగానాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.


 అడవిశేష్ త్వరలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియను వివాహం చేసుకోబోతున్నాడంటూ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని.. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. అడవిశేష్, సుప్రియ పెళ్లి వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. దీనంతటికీ అసలు సూత్రధారి అక్కినేని వారి కోడలు సమంతట. అడవి శేష్, సుప్రియ ఒక్కటవడంలో కీలక పాత్ర పోషించిందట. ఇటీవలే అడవి శేష్, సుప్రియ స్పై థ్రిల్లర్ గూఢచారిలో కలిసి నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com