2018 ఆస్కార్ అవార్డుల్లో అగ్రతాంబూలం అందుకున్న చిత్రం ‘డన్ కిర్క్’. ఇన్సెప్షన్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. 2018- 19 ఆస్కార్ వేడుకల్లో మెరిపించనున్న ఉత్తమ సినిమా ఏది? ఉత్తమ హీరో ఎవరు? ఉత్తమ దర్శకుడు ఎవరు? .. ఈ సస్పెన్స్ కి తెరవీడేందుకు ఇంకెంతో సమయం లేదు. మరో తొమ్మిది రోజుల్లోనే ఫలితం వెలువడనుంది. ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా వేచి చూసే తరుణం రానే వస్తోంది. అయితే ఈసారి ఆస్కార్ రేస్ లో విజేతగా నిలిచే సినిమాపై ఇప్పటి నుంచే గెస్ మొదలైంది. ఉత్తమ సినిమా కేటగిరీలో ఎనిమిది సినిమాల పేర్లు ఇదివరకూ అకాడెమీ ప్రకటించింది. ఇందులో బ్లాక్ పాంథర్ చిత్రం రేస్ లో ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. 2018లో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం టెక్నాలజీని నెకట్స్ లెవల్ లో ఆవిష్కరించిందని ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా కథాంశం, ఆర్టిస్టుల నటన, 3డి గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్ ప్రతిదీ హైలైట్. అలాగే ఉత్తమ హీరోలుగా క్రిస్టియన్ బాలే (వైస్ మూవీ), బ్రాడ్ లీ కూపర్, విల్లెమ్ డెఫ్ఫో, ర్యామీ మాలెక్, విగో వంటి స్టార్లు పోటీపడుతున్నారు. అలాగే ఉత్తమ దర్శకులుగా స్పుక్ లీ (బ్లాక్ కె లాన్ష్ మేన్), పావెల్ (కోల్ వార్), యోర్గాస్ (ద ఫేవరెట్), ఆల్ఫోన్స్ కరోన్ (రోమా) తదితరులు పోటీపడుతున్నారు. బ్లాక్ పాంథర్ (కెవిన్ ఫైజీ.. బ్లాక్ లాన్స్ మేన్), బోహిమన్ రాస్పడీ, ద ఫేవరెట్, గ్రీన్ బుక్, రోమా, ఏ స్టార్ ఈజ్ బోర్న్, వైస్ చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీపడుతున్నాయి. అయితే వీటిలో బ్లాక్ పాంథర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. ఈ చిత్రం పలు ఆస్కార్ లు గెలుచుకోవడం ఖాయం అన్న చర్చ సాగుతోంది.
అంతా బాగానే ఉంది కానీ, గత రెండు మూడు సార్లుగా ఆస్కార్ రేస్ లో మన తెలుగు సినిమాల పేర్లు కూడా వినిపించాయి. ప్రాంతీయ కేటగిరీలో మన ఇండియా తరపునుంచి బరిలో దిగే ఛాన్స్ గతంలో మిస్సయ్యింది. అయోధ్య కుమార్ తెరకెక్కించిన ‘మిణుగురులు’ ఇదివరకూ ఆస్కార్ రేస్ లో మన దేశం తరపున నామినేషన్ కు పోటీపడిన సంగతి తెలిసిందే.