ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతీ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తేవి : మలైకా

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 01:19 PM



పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ బాలీవుడ్‌ జంట మలైకా అరోరా- అర్బాజ్‌ ఖాన్‌ 2017లో విడాకులు తీసుకున్నారు .  అయితే విడాకుల విషయంలో మొదట కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నానని మలైకా తాజాగా వ్యాఖ్యానించారు. తన స్నేహితురాలు కరీనా కపూర్‌ హోస్ట్‌ చేసిన ఓ రేడియో షోలో ఆమె మాట్లాడుతూ... ‘ నేను విడాకులు తీసుకునే ముందు రోజు రాత్రి కూడా.. నా కుటుంబం మొత్తం నా చుట్టూ కూర్చొని నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. అసలు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముందంటూ అందరూ ప్రశ్నించారు. ఈ విషయంలో మరోసారి ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అయితే నా ఇబ్బందిని పూర్తిగా అర్థం చేసుకున్న అనంతరం.. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. మా దృష్టిలో నువ్వెల్లప్పుడూ ధైర్య వంతురాలైన మహిళగానే ఉండిపోతావు అని భుజం తట్టారు. ఆ సమయంలో వారి మద్దతు నాకెంతో సాంత్వన కలిగించింది’ అని చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com