కోట్ల రూపాయలు వదిలేసి అజ్ఞాతంలోకి పవన్ కళ్యాణ్

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 12:52 PM
 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి కోట్లు వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ గ అజ్ఞాతవాసి అన్నది పెడుతున్నారట. ఈ సినిమా కథ ఇదే అంటూ ఫిల్మ్ నగర్ లో ఓ స్టోరీ చెక్కర్లు కొడుతుంది. ఆస్తిపాస్తులున్నా సరే హీరో అజ్ఞాతంలోకి వెళ్లే కథే అజ్ఞాతవాసి అంటున్నారు.కోట్ల కొద్ది ఆస్తి ఉన్నా దేనినో వెతుక్కుంటూ హీరో అజ్ఞాతంలోకి వెళ్తాడట. అందుకే సినిమా టైటిల్ గా అజ్ఞాతవాసి అయితే బాగుంటుందని అంటున్నారు.

స్టోరీ టెల్లర్ గా త్రివిక్రం కు ఓ స్పెషల్ ట్రాక్ ఉంది. సినిమాకు అనుకున్న పాయింట్ ను అంతే అందంగా తెరకెక్కించగలడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తాజా మూవీ కథ కూడా అజ్ఞాతంలోకి వెళ్లే హీరో కథగా చెబుతున్నారు.జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత త్రివిక్రంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందట. 2018 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమా పవన్ త్రివిక్రం కాంబోకి ఉన్న సత్తా ఏంటో చూపిస్తుందని. అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని అన్నారు. కథ కథనాల మీద ఉన్న నమ్మకంతోనే సినిమా బడ్జెట్ లిమిట్ లేకుండా ఖర్చు పెడుతున్నారట.
Recent Post