కూతురు పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసిన స‌న్నీ లియోని

  Written by : Suryaa Desk Updated: Thu, Oct 12, 2017, 02:40 PM
 

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోని, త‌న భ‌ర్త డేనియ‌ల్ వెబ‌ర్ క‌లిసి త‌మ పుత్రిక నిషా కౌర్ వెబ‌ర్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకున్నారు. జులైలో వారు నిషాను ద‌త్త‌త తీసుకున్నారు. అప్పుడు నిషా వ‌యసు 21 నెల‌లు. ఈ లెక్క‌న చూస్తే నిషాకు ఇది రెండో పుట్టిన రోజు. స‌న్నీ దంప‌తులు నిషా పుట్టిన‌రోజును అరిజోనాలో కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సెల‌బ్రేట్ చేశారు. ఈ వేడుక‌కు సంబంధించిన ఫొటోలు ఇంట‌ర్నెట్లో ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి. ప్ర‌తి ఏడాది లాగే ఈసారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెకేష‌న్ వెళ్తున్న‌ట్లు స‌న్నీ ఇటీవ‌ల వెల్ల‌డించింది. కానీ ఈసారి వెకేష‌న్‌లో త‌మ గారాల ప‌ట్టి నిషా కూడా పాలుపంచుకోబోతున్నందుకు ఆనందం ఉన్న‌ట్లు ఆమె తెలిపింది. 
Recent Post