ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హీ ఈజ్ సో హాట్’ అంటున్న హాట్ నటి...

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 22, 2019, 09:13 PM



ప్రభాస్... ఒకే ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా కాదు కాదు... ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకున్న స్టార్. ‘బాహుబలి ది బిగినింగ్’, ‘బాహుబలి ది కంక్ల్యూజన్’ సినిమాల్లో మనోడి యాక్టింగ్‌కు యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. బాలీవుడ్ తారలు కూడా ప్రభాస్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. తాాగా ఈ లిస్ట్‌లోకి మరో హాట్ తార వచ్చి చేరింది. ఆ పాప మరెవ్వరో కాదు... హాట్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ స్వరా భాస్కర్. సినిమాల సెలక్షన్ దగ్గరనుంచి, బయట ఫంక్షన్లలో వేసుకునే డ్రెస్సుల దాకా స్వరా ఏం చేసినా సెన్సేషనే. అలాంటి స్వరా కూడా బాహుబలికి ఫ్యాన్స్ అయిపోయిందట.
సంచలన సన్నివేశాల్లో నటిస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండడం స్వరా భాస్కర్‌కి బాగా అలవాటు. ‘అనార్కలి ఆఫ్ అరా’ సినిమాతో పాటు రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘వీర్ ది వెడ్డింగ్’సినిమాల్లో స్వరాభాస్కర్ నటించిన సన్నివేశాలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ‘స్వయంతృప్తి’ చెందుతున్న సన్నివేశం అయితే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అయినా అలాంటి వాటిని అస్సలు పట్టించుకోనని, అనవసర విషయాలను పట్టించుకుంటూ పోతే ఎదగలేమంటూ గట్టిగానే చెప్పింది స్వరా. స్వయంతృప్తి చెందడం మహిళలు లైంగిక హక్కులను కాపాడుకోవడంలో ఒక చర్య అంటూ సమర్థించుకుంది కూడా. 
ప్రభాస్‌తో నటించాలని ఉందంటూ తన మనసులో మాట చెప్పేసింది. తెలుగులో అంతమంది హీరోలు ఉండగా ప్రభాస్‌తోనే ఎందుకు అని మీడియా ప్రతినిధులు అడగగా... ‘హీ ఈజ్ టూ హాట్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈ హాట్ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం స్వరా భాస్కర్ చేతిలో సినిమాలేవీ లేవు. ‘వీర్ ది వెడ్డింగ్’ సినిమాలో నలుగురు భామలున్నా అందరికన్నా ఎక్కువగా గ్లామరస్‌గా కనిపిస్తూ ప్రమోషన్స్‌లో పాల్గొంది స్వరా. అయినా ఆమె ఖాతాలో కొత్త ప్రాజెక్టులేవీ రాకపోవడం విశేషం.
బాలీవుడ్‌లో పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో టాలీవుడ్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది స్వరా. అందులోనూ స్వరాభాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ తెలుగువాడే. కాకపోతే కుటుంబంతో సహా ఢిల్లీలో సెటిల్ అయ్యారు. దాంతో తెలుగు అర్థం చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదంటూ వయ్యారంగా చెబుతున్న స్వరా భాస్కర్... మొదటి సినిమాతో స్టార్ స్టేటస్ సంపాదించాలని ప్రభాస్‌ను టార్గెట్ చేసింది. ఇప్పటికే ‘సాహో’ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌తో కలిసి రొమాన్స్ చేస్తున్న మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... నెక్ట్స్ ఏ సినిమాలోనైనా ఈ హాట్ బ్యూటీని కన్సిడర్ చేస్తాడేమో చూడాలి. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com