హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గర్ల్, వ్యాంప్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన నమిత కి టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు గానీ కోలీవుడ్ మాత్రం ఈ భారీ అందాల సుందరికి కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పుడు ఓ 60 ఏళ్ల నటుడితో ప్రేమాయణం సాగిస్తొందని కోలీవుడ్ లో పుకార్లు.. అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజు సంపాదించుకున్న నమిత ఇప్పుడు సినిమాల్లేక కష్టాల్లో ఉంది.
60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, పాపం అందులోనూ రాణించలేకపోయింది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.కోలీవుడ్ మీడియాలో కథనాలు అయితే నమిత ప్రేమాయణం సాగిస్తున్న ఆ 60 వయసున్న నటుడు ఎవరో కాదంట.... ఒకప్పుడు హీరోగా, విలన్ గా ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న శరత్ బాబు నమిత తో ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాడని అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.