ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'జవాన్' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2023, 04:46 PM



సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 697.90 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
తెలుగు రాష్ట్రాలు - 42.80 కోట్లు
తమిళనాడు - 35.00 కోట్లు
కర్ణాటక - 34.75 కోట్లు
కేరళ - 11.70 కోట్లు
ROI - 344.80 కోట్లు
ఓవర్సీస్ - 225.90 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 697.90 కోట్ల గ్రాస్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com