ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రో' AP/TS టోటల్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 16, 2023, 04:51 PM



సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' సినిమా జూలై 28, 2023న ప్రపంచవ్యాప్తంగా పెద్ద తెరపైకి వచ్చింది. ఈ సినిమా విడుదల అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద టోటల్ థియేటర్ రన్ లో 54.26 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ ఫాంటసీ కామెడీ డ్రామాలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తమిళ చిత్రం వినోదయ సితం యొక్క అధికారిక రీమేక్. ఈ సినిమాలో కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి మరియు రాజా చెంబోలు కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.


'బ్రో' కలెక్షన్స్::::::
నైజాం : 21.07 కోట్లు
సీడెడ్ : 6.97 కోట్లు
UA : 6.92 కోట్లు
ఈస్ట్ : 4.89 కోట్లు
వెస్ట్ : 4.41 కోట్లు
గుంటూరు : 4.57 కోట్లు
కృష్ణ : 3.54 కోట్లు
నెల్లూరు : 1.85 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 54.26 కోట్లు (85.91 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com