ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యతో కలిసి స్టెప్పెసిన శివ బాలాజీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 17, 2017, 03:54 PM



బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 విజేత శివ బాలాజీ మంచి జోష్‌లో ఉన్నాడు. అక్టోబర్ 14న తన పుట్టిన రోజు సందర్భంగా.. బిగ్ బాస్ రియాల్టీ షోలో తనతో పాల్గొన్న వారికి పార్టీ ఇచ్చాడు. శివ బర్త్ డే పార్టీకి చాలా మంది స్నేహితులు, తోటి నటులు హజరయ్యారు. వేడుకల్లో అరుదుగా మాత్రమే కాలు కదిపే అలవాటున్న శివ బాలాజీ ఆ రోజు మాత్రం భార్యతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశాడు. నీకు మనసిస్తా.. అంటూ ముసి ముసి నవ్వులతో దంపతులిద్దరూ సరదాగా డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేశారు.





సినీ పరిశ్రమకు చెందిన సహచరులు, స్నేహితులతో నేను చేసుకున్న తొలి పుట్టిన రోజు పార్టీ ఇది. హాజరై, నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా భార్య మధుమితపై ఉన్న ప్రేమను నేను బాహాటంగా వ్యక్తం చేయలేను. నాకెందుకో అది సహజంగా అనిపించదు. నా కళ్ల ద్వారా, మనసు ద్వారా నా ప్రేమను తను అర్థం చేసుకుంటుందని శివబాలాజీ ఫేస్‌బుక్‌లో భార్యతో కలిసి డ్యాన్ చేసిన వీడియోను షేర్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com