ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజర్ చూస్తుంటే సినిమాకు అంచనాలను మరింత

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 09:34 AM



కోలీవుడ్ లో ప్రయోగాత్మకమైన సినిమాలను తెరకెక్కించే వారిలో హీరో విక్రమ్ ఒకరు. కేరీర్ లో ఎన్నో వినూత్న సినిమాల్లో నటించిన విక్రమ్ గత కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోవడం లేదు. విక్రమ్ కి తగ్గట్టు కరెక్ట్ స్టోరీ పడితే తప్పకుండా బాక్స్ ఆఫీస్ ను ఎన్ని సార్లైనా బద్దలు కొట్టగలడని చెప్పవచ్చు. అయితే కథలో పాత్రతో అలరిస్తున్నా కూడా దర్శకుల కథనం లోపం వల్ల అపజయలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని విక్రమ్ స్కెచ్ అనే సినిమాతో రాబోతున్నాడు.


సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రీసెంట్ గా చిత్ర యూనిట్ టీజర్ ని రిలీజ్ చేసింది. టీజర్ లో విక్రమ్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేశాడని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గోల చూస్తేనే అర్ధమవుతోంది. ఇన్ని రోజులకి విక్రమ్ కి సరైన పాత్ర దక్కిందని. సౌత్ బాక్స్ ఆఫీస్ కి స్కెచ్ వేశాడు అని ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే టీజర్ లో విక్రమ్ స్టైల్ అంత బావుంది మరి. యాక్షన్ లుక్ తోనే కాకుండా మంచి లవర్ బాయ్ గాను కనిపిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ చందర్ దర్శకత్వం వహిస్తున్నాడు.





టీజర్ చూస్తుంటే సినిమాకు అంచనాలను మరింత పెంచుతుంది అనడం ఖాయం. తమన్నా పాత్ర కూడా ఇందులో చాలావరకు ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ చెప్పింది. తెలుగులో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి విక్రమ్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్.థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2018 జనవరి 12న రిలీక్ కాబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com