ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ గారి 102 చిత్రంలో నటించడం లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేరుగా చెప్పాలనుకొన్నాను. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని రెజీనా ట్విట్టర్లో స్పందించారు.రూమర్‌పై రెజీనా ఖండన అందాల తార రెజీనా కసాండ్రా కూడా త్వరలో బాలకృష్ణ 102 ప్రొడక్షన్లో చేరబోతున్నది. ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారితో పాటు రెజీనా నాలుగో హీరోయిన్ అని ఓ వార్త మీడియాలో షికారు చేసిన సంగతి తెలిసిందే.ఆరా తీయడంతో రెజీనా బాలకృష్ణ చిత్రంలో నటిస్తున్నారనే వార్త విషయంపై రెజీనాతో పలువురు ఆరా తీశారట.
పలువురు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్ కాల్స్ కూడా వెళ్లడంతో ఈ విషయంపై అసందిగ్దతకు రెజీనా ట్విట్టర్లో తెరదించింది.ఇదిలా ఉండగా, బాలకృష్ణ చిత్రం కోసం రెజీనాను చిత్ర నిర్వాహకులు సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై రెజీనా సన్నిహితులు కూడా స్పందించారు. ఓ సినిమాలోని పాత్రను రిజెక్ట్ చేసిన విషయాన్ని మీడియాకు చెప్పడం భావ్యం కాదు అని పేర్కొన్నట్టు మరో వార్త వెలుగు చూసింది. అయితే బాలకృష్ణ సినిమాను రిజెక్ట్ చేయడమనేది ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.