దీపిక పదుకొనే, కత్రినాకైఫ్ తో హాట్ హాటు ప్రేయాణానాలు నడిపాడు రన్బీర్ కపూర్. ఇద్దరికీ బాయ్ బాయ్ కూడా చెప్పేశాడు. ఇప్పుడు మహిరాఖాన్ తో ఎఫైర్ స్టార్ట్ చేశాడు. ఒక ప్రైవేట్ రూమ్లో సిగరెట్లు కాలుస్తూ కనిపించిన ఈ జంట ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐతే ఈ విషయంలో మహిరా పై చాలా విమర్శలు వచ్చాయి. పొట్టి వస్త్రాలు ధరించడం, సిగరెట్ తాగి ఆచారాలు మంతగాలుపుతుందని చాలా మంది విమర్శించారు.ఇది పై తొలిసారిగా పెదవి విప్పింది మహీరా. `అది నా వ్యక్తిగత జీవితం. ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి తిరగడం చాలా సాధారణం. అయినప్పటికీ ఈ సంఘటన ద్వారా చాలా మంచి గుణపాఠం నేర్చుకున్నా! మీడియా ప్రతి చోట ఉంటుందని, వాళ్ల కళ్లుగప్పి తిరగడం కష్టమని నాకు అర్థమైంది` అని చెప్పుకొచ్చింది అమ్మడు. ప్రస్తుతం వెర్నా` అనే సినిమాలో నటిస్తుంది మహిరాఖాన్.ఇక మహిరా విషయానికి వస్తే ఆమె పాకిస్తాన్ నటి. 2007లో ఆలి ఆస్కారిని పెళ్లాడింది. వీరికి ఒక కొడుకు పుట్టాడు. 2015లో ఇద్దరూ విడాకులు తీసుకొని విడివిడిగా జీవిస్తున్నారు.