ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రాజ్ తరుణ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం రాజుగాడు. సంజనారెడ్డి డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఓ దొంగగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. ఓ వైపు ప్రియురాలిని హత్తుకుని.. మరోవైపు ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఫోన్ కొట్టేస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ కనిపిస్తోంది. రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ నటిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.