ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు శిరీష్ సినిమాలో మాత్రం గ్లామర్ షోతో రెచ్చిపోనుందట

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2017, 03:21 PM



అందాలను ఆరబోసే విషయంలో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న అప్ కమింగ్ బ్యూటీ... తన కొత్త సినిమాలో మాత్రం గ్లామర్ షోతో రెచ్చిపోనుందట. అయితే ఇలా చేయడానికి మరో కారణం కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.


ముద్దుగుమ్మలు ఎంతో కొంత అందాల ప్రదర్శన చేయాల్సిందే. అలా చేయని హీరోయిన్లకు అవకాశాలు వస్తాయేమో కానీ... పాపులర్ కావడం మాత్రం కష్టం. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గమనించిన సురభి అనే అప్ కమింగ్ బ్యూటీ... తన నయా మూవీలో గ్లామర్ డోసును బాగా పెంచబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 'బీరువా', 'ఎక్స్ ప్రెస్ రాజా', 'జెంటిల్ మేన్' సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్న సురభికి విజయాలు దక్కినా...స్టార్ హీరోల సరసన అవకాశాలు మాత్రం రావడం లేదు.


 ఇందుకు అసలు కారణం తనలోని అందాలను ప్రదర్శించకపోవడమే అని భావించిన ఈ యావరేజ్ బ్యూటీ... అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో ఎక్స్ పోజింగ్‌కు సై అనేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే సురభి ఇందులో గ్లామర్ షో చేయడానికి మరో కారణం కూడా ఉందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ కొత్త సినిమాలో సురభితో పాటు సీరత్ కపూర్ కూడా నటిస్తోంది. అందాల ప్రదర్శనకు ఎప్పుడు సిద్ధంగా ఉండే సీరత్ కపూర్‌కు సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో... తాను కూడా ఇందుకు రెడీ అనేసిందట సురభి.


  ఈ రకంగా అల్లు శిరీష్ కొత్త సినిమాలో సీరత్ కపూర్‌తో సురభి పోటీ పడి అందాలు ఆరబోస్తోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తనకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమనే నమ్మకంతో ఉన్న సురభి... అందాల వల వేసి దర్శకనిర్మాతలను అట్రాక్ట్ చేయాలని చూస్తోందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.మరి... ఇంతకాలం అందాల ప్రదర్శనకు దూరంగా ఉన్న సురభి... ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లామర్ హీరోయిన్ అయిపోతుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com