ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బర్త్ డే స్పెషల్.. ‘సాహో’ ఫస్ట్ లుక్ అదుర్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 23, 2017, 10:06 AM



యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా.. చిత్ర యూనిట్ సోమవారం సాహో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ముఖం కనిపించకుండా కర్చీఫ్‌తో కట్టుకొని, ఓ చేతిని కోటు జేబులో ఉంచి.. మరో చేత్తో ఫోన్లో మాట్లాడుతూ నల్లటి దుస్తుల్లో ప్రభాస్ నడుచుకుంటూ వస్తున్న పోస్టర్‌ ఆకట్టకుంటోంది. బాహుబలితో ఘన విజయాన్ని అందుకున్న ప్రభాస్ మరో భారీ హిట్‌ను అందుకునేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ తెరకెక్కిస్తున్న ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి.


‘బాహుబలి’ ప్రాజెక్ట్ కోసమే ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్.. ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ‘సాహో’గా మన ముందుకు రానున్నాడు. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ టీజర్ ఇప్పటికే విడుదలై ఆకట్టుకోంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com