గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ‘జెర్సీ’లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాని, అర్జున్ అనే పాత్రలో నటించాడు. ఇక నాని కుమారుడి పేరు కూడా అర్జున్ కాగా.. ‘మా నాన్న నా పేరును దొంగలించాడు’ అంటూ ఫీల్ అవుతు న్నాడు నేచురల్ స్టార్ నాని తనయుడు. ఈ మేరకు ఓ టీ షర్టును వేసుకొని తన నిరసనను వ్యక్తపరిచాడు జున్ను (తనయుడిని నాని పిల్చుకునే పేరు). అయితే దానికి ‘సారీ రా జున్ను తప్పలేదు’ అంటూ కామెంట్ పెట్టాడు నాని.కాగా జెర్సీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు.