ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమా

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 01:43 PM



'రంగస్థలం' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌, సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా రావాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో రామ్‌చరణ్‌, సుకుమార్‌, కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చరణ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్‌', సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్‌సీ 16 చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే!  సోమవారం రామ్‌చరణ్‌ -సుకుమార్‌ తమ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. దీంతో ఎప్పటినుంచో అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్న కోరిక తీర్చినట్లయింది. అయితే సుకుమార్‌-చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ గురించి రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్ లో  చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ‘రామ్‌ చరణ్‌తో సుకుమార్‌ తీయనున్న సినిమాలో ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. నేను దీని గురించి ఇంతకు మించి చెప్పకూడదు. ఆ మూవీలో ఓపెనింగ్‌ సీన్‌ చూసిన తర్వాత థియేటర్లో ప్రేక్షకులు సీట్‌ ఎడ్జ్‌కు వచ్చేస్తారని నమ్మకంగా చెప్పగలను’’ అని అన్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ చిత్రంపై రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ షూటింగ్‌ సమయంలో సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు రామ్‌ చరణ్‌ చెపారు. ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ గురించి వివరించాడు. అది ఐదు నిమిషాలు ఉంటుందని.. అదొక అద్భుతమని తెలిపారు. నాటి నుంచి ఈ సినిమా ప్రకటన కోసం నేను ఎదురుచూస్తూనే ఉన్నా. ఈ మూవీ వీళ్లిద్దరి కెరీర్‌లోనే మైలురాయి. దీని గురించి ఇంతకంటే ఎక్కువ లీక్‌ చేయలేను’ అని రాసుకొచ్చారు. 'రంగస్థలం’ సూపర్‌ హిట్‌ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఆర్‌సీ 17 చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా రాజమౌళి, కార్తికేయల కామెంట్స్‌తో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.  వచ్చే ఏడాది ఆఖర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com