ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'హనుమాన్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 02:35 PM



యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన భారతీయ సూపర్ హీరో చిత్రం 'హనుమాన్' చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా తమిళ, మలయాళం, కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సూపర్ హీరో చిత్రం ఏప్రిల్ 5న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రాకటించింది.

ఈ సినిమాలో తేజకు జోడీగా అమృత అయ్యర్ జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com