ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20M+ వ్యూస్ ని సాధించిన 'కంగువ' టీజర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 02:40 PM



కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన తదుపరి సినిమాని దర్శకుడు సిరుత్తై శివతో అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు 'కంగువ' అనే టైటిల్‌ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ యాక్షన్-ప్యాక్డ్ సినిమా టీజర్ ని విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్ 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దిశా పటానీ సూర్య సరసన జోడిగా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ బ్యానర్లపై వంశీకృష్ణ, ప్రమోద్, కెఇ జ్ఞానవేల్రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com