ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గీతాంజలి మళ్ళీవచ్చింది' కెనడా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 04:45 PM



నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వంలో అంజలి నటించిన గీతాంజలి సినిమాకి చిత్ర బృందం సీక్వెల్ ని ప్రకటించింది. ఈ చిత్రానికి 'గీతాంజలి మళ్ళీవచ్చింది' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా కెనడా రైట్స్ ని ది విలేజ్‌గ్రూప్ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు.

శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ మరియు ఇతర నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది.


అంజలి 50వ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీత దర్శకుడు. కోన ఫిలింస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కోన వెంకట్, ఎంవివి సినిమాస్ ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com