ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆయ్' ఫస్ట్ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 05:00 PM



టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ నటించిన మ్యాడ్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. తాజాగా ఇప్పడూ ఈ సినిమా సీక్వెల్ కోసం నటుడు సిద్ధమవుతున్నాడు. కొత్త దర్శకుడు అంజి కంచిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆయ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. బన్నీ వాస్‌తో పాటు విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇటీవలే  మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని సూఫియానా అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్ లో వన్ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది.


రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానున్నది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com