ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త విడుదల తేదీని ఖరారు చేసిన 'ఆ ఒక్కటి అడక్కు'

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 05:51 PM



మల్లి అంకం దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 19, 2024న థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి.


ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నరేష్ కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో జామీ లీవర్, కల్పలత, హరి తేజ, వెన్నెల కిషోర్, హర్ష చెముడు, అనీష్ కురువిల్లా మరియు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలక ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com