ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లాల్ సలామ్' నుండి తేర్ తిరువిజా వీడియో సాంగ్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 06:54 PM



ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' చిత్రం ఫిబ్రవరి 9, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమాలో రజనీ ముంబైకి చెందిన మొయిదీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. లాల్ సలామ్ సినిమా క్రికెట్ మరియు హిందూ-ముస్లిం మత ఘర్షణల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి తేర్ తిరువిజా వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌, విష్ణు విశాల్ మరియు విక్రాంత్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో జీవిత రాజశేఖర్ రజనీకాంత్ సోదరిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com