ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ మొత్తానికి అమ్ముడయిన 'కల్కి 2898 AD' హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 06:56 PM



నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.


తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ డిజిటల్ హక్కులు 175 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. హిందీ హక్కులను పొందేందుకు అనేక ప్లాట్‌ఫారమ్‌లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను (హిందీ మాత్రమే) కొనుగోలు చేసినట్లు సమాచారం.

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ ప్రపంచవ్యాప్తంగా మే 9, 2024న విడుదల కానుంది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్,మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com