ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఫైటర్‌రాజా' టీజర్‌ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 07:28 PM



రన్‌వే ఫిలింస్ నిర్మిస్తున్న 'ఫైటర్ రాజా' అనే స్టైలిష్ యాక్షన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మాయ ఎస్ కృష్ణన్ మరియు ర్యామ్జ్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ ని మార్చి 28న హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో సాయంత్రం 4.05 గంటలకి విడుదల చేయనున్నట్లు అంతేకాకుండా 'మాస్ కా దాస్' విశ్వక్‌సేన్ ఈ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో తనికెళ్ల భర్ణి, హర్ష్ రోషన్ మరియు శివ నందన్ కూడా కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి రచయిత-దర్శకుడు కృష్ణ ప్రసాద్ దర్శకత్వం వహించారు. తమడ మీడియా మరియు రన్‌అవే ఫిల్మ్స్ బ్యానర్‌లపై దినేష్ యాదవ్ బొల్లెబోయిన్ మరియు పుష్పక్ జైన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com