ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'చిత్రం చూడరా' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 27, 2024, 08:51 PM



ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'చిత్రం చూడరా' అనే టైటిల్‌ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ మోస్ట్ ఎవైటెడ్ పవర్ ప్యాక్డ్ చిత్రం చూడరా సినిమా యొక్క ట్రైలర్ ని శుక్రవారం అంటే మార్చి 29న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ చిత్రంలో అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ధన తుమ్మల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com