ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'సుందరం మాస్టర్'

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 04:57 PM



కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో కమెడియన్ హర్ష చెముడు నటించిన 'సుందరం మాస్టర్' సినిమా ఫిబ్రవరి 23, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క OTT రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మార్చి 28న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com