ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆఫీసియల్ : 'సాలార్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 05:11 PM



పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్: పార్ట్ 1 డిసెంబర్ 22, 2023న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఏప్రిల్ 21, 2024 సాయంత్రం 05.30 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com