ట్రెండింగ్
Epaper    English    தமிழ்

1 సంవత్సరం పూర్తి చేసుకున్న 'విరూపాక్ష'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 04:53 PM



కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మిస్టరీ థ్రిల్లర్ సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ బ్లాక్ బస్టర్ చిత్రం విడుదలయ్యి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన జోడిగా సంయుక్త మీనన్ నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com