ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ బ్యాడ్ అగ్లీ : అజిత్ కి జోడిగా శ్రీలీల

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 06:00 PM



అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో అజిత్ కి జోడిగా గ్లామర్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ జూన్ 2024లో ప్రారంభమవుతుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ 2025 పొంగల్‌కి గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com