ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సత్యభామ' లోని కళ్లారా లిరికల్ వీడియో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 08:38 PM



సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'సత్యభామ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. ఈ సినిమా మే 17న విడుదల కానుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని కళ్లారా అనే టైటిల్ తో విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.


మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com