ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 11:31 PM



టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఈ సినిమాకి 'శబరి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా మే 3న విడుదల కానుంది.


తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి 'అనగనగా ఒక కధల' అనే లిరికల్ సాంగ్ ఏప్రిల్ 27న మధ్యాహ్నం 12:01 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.మహా మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com