ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఇండియన్ 2' విడుదల వాయిదా

cinema |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 03:50 PM



కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం, ఇండియన్ 2 మొదట అనుకున్నట్లుగా జూన్ 2024లో విడుదల కావటం లేదని సమాచారం.


ఈ విజిలెంట్ యాక్షన్ డ్రామా నిర్మాతలు జూలై 11ని విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి త్వరలోనే మూవీ మేకర్స్ నుండి అధికారిక ధృవీకరణ వెలువడే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com