ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ లో విడుదలకి ప్లాన్ చేసుకున్న 'సైరా'

cinema |  Suryaa Desk  | Published : Thu, May 23, 2019, 05:58 PM



చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరి దశకి చేరుకుంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అప్పటికి అనుకున్న పనులు పూర్తికావనే ఉద్దేశంతో, అక్టోబర్ 2వ తేదీకి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. దర్శక నిర్మాతలు బాగా ఆలోచించి ఈ తేదీనే ఖాయం చేసుకున్నారనేది తాజా సమాచారం.

చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం .. స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడిన కథ కావడం వలన అక్టోబర్ 2వ తేదీనే ఈ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ అనే ఉద్దేశంతో ఈ తేదీని ఖరారు చేసుకున్నారని అంటున్నారు. ఈ కారణంగానే అక్టోబర్లో విడుదలకి ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలు, సంక్రాంతి వైపుకి వెళుతున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార కనిపించనున్న సంగతి తెలిసిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com