ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 31, 2017, 04:29 PM



టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మాస్ రాజా రవితేజ లాంటి స్టార్లతో సినిమాలు తీసిన కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ.. ‘అర్జున్ రెడ్డి’తో మంచి పేరు సంపాదించిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇటీవలే ‘జై లవకుశ’తో పర్వాలేదనిపించిన బాబీ.. ఇటీవలే విజయ్ కు ఓ లైన్ చెప్పాడట. అతడికది నచ్చి.. ఫుల్ స్క్రిప్టు రెడీ చేయమన్నాడట. పూర్తి స్క్రిప్టు కూడా నచ్చితే విజయ్ ఈ సినిమా చేసేయడానికి రెడీనే అట.


కాకపోతే విజయ్-బాబీల శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. విజయ్ పూర్తిగా భిన్నమైన సినిమాలు చేస్తున్నాడు మొదట్నుంచి. ‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘పెళ్లిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’.. ఇవన్నీ క్లాస్ టచ్ ఉన్న.. విభిన్నమైన సినిమాలు. బాబీయేమో మాస్ మసాలా సినిమాల చుట్టూ తిరుగుతుంటాడు. అతను రచయితగా చేసినవి.. దర్శకుడిగా రూపొందించినవి.. అన్నీ కూడా కమర్షియల్ సినిమాలే. విజయ్ కొంచెం రూటు మార్చి ‘ద్వారక’ సినిమా చేస్తే అది బోల్తా కొట్టింది. దీంతో మళ్లీ తన స్టయిల్లో సినిమాలు చేసుకుపోతున్నాడు. పరశురామ్.. నందిని రెడ్డి.. క్రాంతి మాధవ్.. భరత్ కమ్మ.. ఇలా తనకు నప్పే దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. మరి బాబీతో అతడికి ఎలా సింకవుతుందన్నది సందేహం. నిజంగానే వీరి కాంబినేషన్ ఓకే అయితే.. ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com