ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐష్ కి హ్యాపీ బర్త్ డే..ఈ రోజు 44వ పుట్టిన రోజు

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2017, 09:13 AM



సోగకళ్ల సోయగాల చిన్నది ఐశ్వర్యారాయ్ మూవీస్ లోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తున్నా … ఆమె ఈ రోజు 44వ పుట్టిన రోజు జరుపుకొంటున్నా . .. అంత వయసుందని అసలు ఎవరైనా నమ్ముతారా? మీరూ నమ్మరు కదా.. .. అవును. ఐష్ ఇప్పటికీ ఇరవై ఏళ్ల చిన్నదానిలా మిలమిల మెరిసిపోతోంది. ఆ కంటి మిలమిలలు, ఆ ఒంటి తళతళలు చూస్తే … కుర్రకారు అబ్బా! ఐష్ .. ఏ దిల్ హై ముష్కిల్ .. అని అనుకోకుండా ఉండలేకపోతున్నారు .


తన తర్వాత ఎందరు హాట్ గాళ్స్ వచ్చినా ఐశ్వర్యారాయ్ ఇప్పటికీ యూత్ మతులు పోగొడుతోంది. తమకంటే చిన్న వయసు వాళ్లతో కూడా హీరోయిన్ గా చేస్తూ .. డామినేట్ చేస్తోంది. ఆ నున్నటి బుగ్గలు, విల్లులా వంపు తిరిగిన ఆ పెదాలు, ఆ మాధుర్యాలు … తళుకులీనుతూ రెచ్చగొట్టే మేని వంపులు … పరవశం కలిగిస్తూ ఫిదా అయిపోయేలా చేస్తున్నాయి. ఒక బిడ్డ తల్లి అయినా .. . ఐష్ అలా కనిపించదు. 


ఐశ్వర్యారాయ్ పేరుకు తగ్గట్టుగానే తన లుక్స్ తో, బాడీ బ్యూటీతో ఐస్ చేస్తోంది. 22 ఏళ్ల కిందట 1994లో మిస్ వరల్డ్ గా సెలెక్ట్ అయినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. యూత్ ఆమెకోసం ఔర్ ప్యార్ హోగయా అంటూ, దేవదాసులై పోతున్నారు. తమ ప్రియమైన జోధా అనుకుంటూ మొహబ్బతే అంటూ, హమ్ దిల్ దేకే సనమ్ గా ఫీలవుతూ .. .. తెగ ఇదై పోతున్నారు.


తన బ్యూటీతో యువకుల్ని పిచ్చివాళ్లను చేస్తూ, వాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా ఉన్న ఐష్ ఈ రోజు తన 44వ జన్మదిన వేడుకలని గ్రాండ్ గా జరుపుకోనుంది. ఇప్పటివరకు సౌత్ లోనే కాక నార్తలోను ఎంతో మంది మనసులు గెలుచుకున్న ఈ అమ్మడు మరెన్నో మూవీస్ చేయాలని, ఇంకా ఎన్నో బర్త్ డేస్ జరుపుకోవాలని మనం అందరం కోరుకుందాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com