ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్‌పై విరుచుకుప‌డ్డ తాప్సీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 01, 2017, 02:36 PM



 తనకు స్టార్‌ హీరోయిన్‌తో సమానమైన రేంజ్‌ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ. తనని గుర్తించడం లేదు అని బాధపడితే ఎవరూ తప్పు పట్టరు కానీ, తనకి తాను స్టార్‌ హీరోయిన్‌ బిరుదు ఇచ్చుకోవడమే బాగాలేదు అంటున్నారు బాలీవుడ్‌ జనాలు.దక్షిణాది నుంచి నార్త్ కు వెళ్లిన వేరే ఏ హీరోయిన్ తో పోల్చినా అమ్మడికి విజయాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు పెర్ఫామెన్స్.. ఇటు కమర్షియల్ మూవీస్ తో సత్తా చాటేస్తున్న తాప్సీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమోతుతనం తగ్గించుకోలేకపోతోంది.


తాప్సీ ఈ మధ్య అనవసరంగా నోరుపారేసుకొని బాలీవుడ్ కి కూడా దూరమయ్యేలాగా ఉంది.రీసెంట్ గానే జుడ్వా2 మూవీతో బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ ను కూడా ఖాతాలో వేసుకున్న తాప్సీ పన్ను.. తనకు ఇంకా టాప్ యాక్ట్రెస్ అంటే అర్ధం తెలియదని.. అస్సలు ఆ మాటే తన కెరీర్ లో వినిపించడం లేదని చెబుతోంది. అసలు టాప్ నటి అన్న మాటకు అర్ధం ఏంటో తెలియడం లేదని.. ఇందుకోసం ఏమైనా స్పెషల్ గా ఎగ్జామ్స్ ఉంటే రాసేందుకు తాను సిద్ధమంటూ వెటకారం కూడా ఆడుతోంది తాప్సీ. తనను ఎవరూ టాప్ హీరోయిన్ గా గుర్తించడం లేదన్నది ఈమె బాధ. పైగా సక్సెస్ లను బేస్ చేసుకుని ఇలా డిసైడ్ చేసేట్లు అయితే కనుక..తనకు సౌత్ లో ఎక్కువగా ఫ్లాప్స్ ఉండడంతో.. తన కెరీర్ లో వాటి వాటా ఎక్కువగా ఉంటుందని వాపోతున్న తాప్సీ.. టాప్ హీరోయిన్స్ పైనా.. సౌత్ పైనా తన అక్కసు బాహాటంగానే వెళ్లగక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com