టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న రకుల్‌ప్రీత్ సింగ్ ఫిట్నెస్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని గచ్చిబౌలితో పాటు విశాఖపట్నంలోనూ ‘ఎఫ్45’ పేరిట అత్యాధునిక ఫిట్నెస్ ట్రైనింగ్ జిమ్‌ను రకుల్ గతంలో ప్రారంభించింది. అయితే తాజాగా హైదరాబాద్‌లోని కోకాపేటలో కూడా రకుల్ తన ‘ఎఫ్45’ జిమ్‌ను తెరిచింది. ‘ఈరోజు సాయంత్రం 6 గంటలకు కోకాపేటలో జిమ్ ప్రారంభమవుతుంది, మీ ట్రైనర్స్‌ని కలవడానికి రండి’ అంటూ మంగళవారం రకుల్ ట్వీట్ చేసింది.కోకాపేటలో జిమ్ ప్రారంభం సందర్భంగా రకుల్‌ప్రీత్‌కు ట్విట్టర్లో చాలా మంది అభినందనలు తెలిపారు. వీరిలో అక్కినేని నాగార్జున గారి చిన్నబ్బాయి అఖిల్ కూడా ఉన్నాడు. రకుల్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ అఖిల్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది. ‘హలో! అభినందనలు!!! నువ్వు పూర్తిస్థాయి మహిళా వ్యాపారవేత్తవు, రాక్‌స్టార్‌వి! నాకెల్లప్పుడూ ఇష్టమైన వ్యక్తికి ఆల్ ది బెస్ట్’ అని అకిల్ ట్వీట్ చేశాడు.దీనికి రకుల్ కూడా స్పందించింది. ‘హలో థ్యాంక్యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. త్వరలో మనం సెలబ్రేట్ చేసుకుందాం’ అని రకుల్ రిప్లై ఇచ్చింది.