సన్నీ లియోన్.. పరిచయం అక్కర్లేని పేరిది. పోర్న్ స్టార్‌గా కెరీర్ ఆరంభించిన సన్నీ.. రియాల్టీ షోలు, సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సన్నీ లియోన్ అంటే యువతలో క్రేజ్. అందుకే మనదేశంలో ఎక్కువ మంది నెట్లో గాలించిన వ్యక్తుల జాబితాలో వరుసగా నాలుగేళ్లపాటు సన్నీ అగ్రస్థానంలో ఉంది. సన్నీ అంటే కేవలం గ్లామరస్ పాత్రలు, కండోమ్ యాడ్స్ మాత్రమే కాదు. సన్నీ లియోన్ అంటే ఓ బ్రాండ్. అందాలతో విందు చేసే సన్నీ.. ఆర్థిక విషయాల్లోనూ ఎంతో ముందుంది. ఆమె అందాలను చూసి మైమరచి పోవడమే కాదు ఆమె నుంచి ఆర్థిక పాఠాలు కూడా నేర్చుకోవచ్చు.