తన భార్య ఐశ్వర్యరాయ్ ‘సూపర్ మామ్’ అంటూ తెగ పొగిడేస్తున్నాడు అభిషేక్ బచ్చన్. బుధవారం ఐష్ తన 44వ పుట్టినరోజు జరుపుకొంది. ఈ సందర్భంగా ఐష్ గురించి అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘ఐష్ తల్లయినప్పుడు తన కెరీర్ వెనకబడిపోయింది. ఈరోజు తను ఆరాధ్య కోసం అన్నీ చేస్తోంది. ఐష్ సూపర్‌మామ్. ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్య లావైపోయిందని చాలా మంది కామెంట్లు చేశారు. తప్పుడు కథనాలు రాశారు. అది నన్ను చాలా బాధించింది. ఇదే విషయం గురించి ఐష్‌కి చెబితే.. ‘ఇలాంటివన్నీ ఎక్కువ రోజులు ఉండవు’ అని చెప్పేది. ఐష్ గురించి తెలిసిన వారిందరికీ తను జిమ్‌కి వెళ్లదన్న విషయం తెలుసు. నేను ఐష్ ‘ధూమ్ 2’ సినిమా చేస్తున్నప్పుడు ఒకసారి నేను బలవంతంగా జిమ్‌కి తీసుకెళ్లాను’’
‘‘ఎక్కువ సమయం షూటింగ్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు కూడా ఐష్ నోరుతెరిచి ఏమీ చెప్పేది కాదు. అంతెందుకు.. విమానంలో వెనక సీటు ఇచ్చారని కానీ మెర్సిడెజ్కి బదులు మారుతి కారులో కూర్చోపెట్టారని కానీ ఎప్పుడూ ఫిర్యాదులు చేయలేదు. ఈ రోజుకీ ఆమెను ప్రపంచంలోనే అందమైన మహిళగా భావిస్తారు. తనకి అభిమానులంటే చాలా గౌరవం.’ అని తన సతీమణి గురించి గర్వంగా చెప్పుకొచ్చారు అభిషేక్.
పుట్టినరోజు సందర్భంగా ఐష్ తన తల్లి వృందా రాయ్, కుమార్తె ఆరాధ్యతో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించింది. ప్రస్తుతం ఐష్ ‘ఫ్యానీ ఖాన్’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఐష్‌కి జోడీగా రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నారు. అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.