ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“పీఎస్వీ గరుడ వేగ” రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2017, 02:34 PM



నటీనటులు: డా. రాజశేఖర్, పూజ కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, శ్రద్ధ దాస్, నాజర్, ఆలి, సన్నీ లియోన్ (స్పెషల్ సాంగ్), రవి వర్మ, పోసాని, ప్రిద్వి, షాయాజీ షిండే. సినిమాటోగ్రఫి అంజి,సురేష్, శ్యాం ప్రసాద్,  ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల కథ, : ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రెడ్డి కధనం, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు సంగీతం : శ్రీ చరణ్ పాకాల,  నిర్మాత :  కోటేశ్వర రాజు


కథ:శేఖర్ (డా. రాజశేఖర్) NIA (నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ) అధికారి. ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీ గా వుండటం వల్ల భార్య విడాకులు కోరుతుంది. శేఖర్ ఇకనుంచి ఫ్యామిలీ తో టైం గడుపుతానని మాటిస్తాడు. ఇంతలో జరిగిన చిన్న కార్ యాక్సిడెంట్ లో శేఖర్ ఒక ప్రొఫెషనల్ snyper తో గొడవ పడతాడు.శేఖర్ ఇంటికి వచ్చి టీవీ లో ఒక ముసలామె అనుమానాస్పదం గా చనిపోవడం చూసి, snyper పై అనుమానం వస్తుంది. వాళ్ళ టీం తో కలిసి snyper ని పట్టుకునే ప్రయత్నం లో snyper చనిపోతాడు. ఈ హత్య వెనుక తెలియని ఇంకో మిస్టరీ ఉంది అని తెలుసుకుంటాడు. ఆ మిస్టరీ ని ఎలా చేదించాడు అనేది మిగిలిన కధ. ఇలాంటి కథ లు మనం హాలీవుడ్ మూవీస్ లో చాలా చూస్తాము. కాని ఒక చిన్న పాయింట్ ని మూవీ మొత్తం చేదించడం ఈ మధ్య వచ్చిన spyder మూవీ ని గుర్తుకు తెప్పిస్తుంది.


 


నటన :డా. రాజశేఖర్ రెండేళ్ళ తరువాత ఈ సినిమా చేసాడు. ఈ సినిమా కధ కి రాజశేఖర్ టైలేర్ మేడ్ హీరో. కాని యాక్షన్ సీక్వెన్స్ లో తన ఏజ్ వల్ల . రాజశేఖర్ ఎఫెక్ట్ తగ్గింది. మొత్తం మీద ఈ సినిమా కోసం తను పడ్డ కష్టం తెర పై కనిపిస్తుంది. సినిమా లో డా. రాజశేఖర్ లేని సీన్స్ చాలా చాలా తక్కువ. హీరొయిన్ పూజ కుమార్ సినిమా కి కావాల్సిన గ్లామర్ తేలేక పోయింది.


ఒక హాలీవుడ్ మూవీ లో మిడిల్ ఏజ్ హీరొయిన్ లాగ వుండటం తెలుగు సినిమా లవర్స్ మైండ్ సెట్ కి సూట్ కాలేదు. మెయిన్ విలన్ గా ఫీల్ కావాల్సిన “కిషోర్” సెకండ్ ఆఫ్ లో ఎంటర్ అవుతాడు. కాని ఒక మెయిన్ విలన్ ని ఎలివేట్ చేసే సీన్స్ ఒక్కటి కూడా లేక పోవడం వల్ల తన నటన కి స్కోప్ లేక పోయింది. పృధ్వి, ఆలి కామెడి పండించడానికి ట్రై చేసారు కానీ అంత గా వర్కౌట్ కాలేదు. నాజర్, పోసాని, షాయాజీ షిండే, రవి వర్మ వాళ్ళ పాత్ర లకి న్యాయం చేసారు.


ఫస్ట్ హాఫ్ చాలా హై వోల్టేజ్ తో ముగుస్తుంది. కాని సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ని దాటి నిలువలేక పోయింది. డా. రాజశేఖర్ ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ హాఫ్ లో తనని ఒక ఫ్యామిలీ మాన్ గా చూపించి ఈ ఇన్వెస్టిగేషన్ కోసం డ్యూటీ కి తిరిగి వచినట్లు కధనం అల్లుకుంటే తన ఏజ్ ఇష్యూ కనిపించకుండా వుండేది.


సినిమా మొత్తం ఒకే ఇన్వెస్టిగేషన్ మీద చూపించే సరికి సెకండ్ హాఫ్ లో ఇంటరెస్టింగ్ నారేషన్ మిస్ అయింది. కానీ ప్రవీణ్ సత్తారు ప్రతి సీన్ చాల క్వాలిటీ తో తీసాడు. ఈ సినిమా తనకి ఫ్యూచర్ లో మంచి ఆఫర్స్ తెప్పించే అవకాశంఉంది.


టెక్నికల్ డిపార్ట్మెంట్స్: ఈ సినిమా కి సినిమాటోగ్రఫి సూపర్బ్ గా సెట్ ఐంది. మొత్తం ఐదుగురు కెమెరామెన్స్ పని చేసారు. ఏ సీన్ ఎవరు చేసారో డైరెక్టర్ కే ఎరుక. నిర్మాత M. కోటేశ్వర రాజు ఖర్చు సినిమా లో కచ్చితం గా కనిపిస్తుంది. ఫామ్ లో లేని రాజశేఖర్ పై ఇంత ఖర్చు చేయడం నిజం గా డేరింగ్ అండ్ డాషింగ్. ఎడిటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. ఇందులో రెండు సాంగ్స్ మాత్రమే వున్నాయి. సన్నీ లియోన్ సాంగ్ సూపర్బ్ గా వచ్చింది మాస్ ని ఈ సాంగ్ ని ఎంతో ఎట్రాక్ట్ చేస్తుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com