ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మడి ఫిట్ నెస్ ని చూస్తే ఎవ్వరైనా సూపర్ అనాల్సిందే

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2017, 02:48 PM



ఈ రోజుల్లో అబ్బాయిలు ఫిట్ నెస్ గురించి ఆలోచిస్తున్నారో లేదో కరెక్ట్ గా చెప్పలేము గాని ఓ వర్గం అమ్మాయిలు మాత్రం ఫిట్ నెస్ ని కరెక్ట్ గా మెయింటెన్ చెయ్యాలని అనుకుంటున్నారు. పదహరేళ్లు దాటితే చాలు శరీరాకృతిని ఫిట్ గా ఉంచుకోవడానికి జిమ్ వర్కౌట్స్ టైమ్ టూ టైమ్ ఫాలో అవుతున్నారు. కానీ బిజీ బిజీ ప్రపంచంలో ఒక్కోసారి వర్కౌట్స్ చేయడానికి వీలు పడదు. అయితే ఒక సీనియర్ హీరోయిన్ మాత్రం ఈజి టిప్స్ చెబుతాను అంటోంది. 


ఆమె ఎవరో బాలీవుడ్ లో మొన్నటి వరకు సూపర్ సెక్సీ గర్ల్ అనిపించుకునేలా సినిమాలు చేసిన బిపాస బసు. అమ్మడి ఫిట్ నెస్ ని చూస్తే ఎవ్వరైనా సూపర్ అనాల్సిందే. అయితే గత ఏడాది పెళ్లి చేసుకున్నప్పటి నుండి సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అవి రావట్లేదో.. ఈమె చేయట్లేదో తెలియదు కాని.. అమ్మడు చివరకు ఒక కండోమ్ యాడ్లో అందాలను దారబోసింది. ప్రస్తుతం ఆమె వయసు 38 అయినా ఇంకా యువ హీరోయిన్ అనే ఆమె ఫీలింగ్. అసలు మ్యాటర్ లోకి వెళితే.. అమ్మడి కి ఫిట్ నెస్ ని ఎలా మెయింటెన్ చేయాలో కరెక్ట్ గా తెలుసు. కొంత మంది హీరోయిన్స్ బిపాస ని ఇప్పటికీ ఫిట్ నెస్ విషయంలో సలహాలు అడిగి తీసుకుంటారు.


అయితే ఇక నుంచి ఈ సీనియర్ హీరోయిన్ అందరికి హెల్ప్ చేస్తుందట. ఒక ఇంటర్నెట్ బ్లాగ్ ని కూడా రెడీ చేసింది. ఇక నుంచి ఫిట్ నెస్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడుగవచ్చునని తెలిపింది. అంతే కాకుండా ప్రతి వారం తనే చేసి ఒక వీడియో ద్వారా చూపిస్తుందట. సో.. అందంగా ఫిట్ గా కావాలని అనుకునే మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అంటోంది బిపాస.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com