ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ తో ఛాన్స్ .. ఆమెకు కలిసొస్తుందే

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 03, 2017, 03:42 PM



టాలీవుడ్ లో ఒక్క స్టార్ హీరోతో సినిమా చేస్తే చాలు కోలీవుడ్ టూ బాలీవుడ్ కి ట్రాక్ సెట్ అయినట్టే అని చాలా మంది ఆప్ కమింగ్ హీరోయిన్స్ సెంటిమేంట్ గా ఫీల్ అవుతారు. ఆ తరహాలో బాలీవుడ్ కి చాలామందే వెళ్లారు. ఇక కొలీవూడ్ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకొంటున్నారు. ఈ మధ్యన కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ అయితే టాలీవుడ్ లో ఛాన్సులు వస్తే వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడం లేదు. 


ఇక అసలు విషయానికి వస్తే బాలీవుడ్ లో ధోని బయోపిక్  చిత్రంలో మెయిన్  హీరోయిన్ గా కైరా అద్వానీ నటించిన విషయం తెలిసిందే. ఫంగ్లీ అనే సినిమాలో కూడా నటించింది. అయితే అమ్మడికి అంతగా అవకాశాలు రాలేదు. అయితే కెరీర్ మొదట్లో  టాలీవుడ్ హీరో మహేష్ బాబు తో ఒక్క ఛాన్స్ దక్కించుకుంటే సక్సెస్ అవుతావని ఆమె తండ్రి చెప్పాడట. అమ్మడి అదృష్టం ఏమిటో గాని తొందరగానే ఆ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మహేష్ - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆ షూటింగ్ తో బిజీగా వుంది.  అయతే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే కైరా అద్వానీకి కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయట. 


మురగదాస్ డైరెక్షన్ లో విజయ్ తన 62వ సినిమాను తీయడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమాలో మొదట రకుల్ ప్రీత్ - సోనాక్షి సిన్హా ను అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ మురగదాస్ వారితో సినిమాలని తీసి డిజాస్టర్స్ ని అందుకున్నాడు. దీంతో కొత్త వారిని సెలెక్ట్ చేయమని విజయ్ సలహా ఇచ్చాడట. డైరెక్టర్ ఫైనల్ గా కైరా అద్వానీ ని సెలెక్ట్ చేశాడని తెలుస్తోంది. అలాగే మరికొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా అమ్మడికి అందుతున్నట్లు టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com