ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెహ్రీన్.. రెడ్ శారీలో.. స్టన్నింగ్ పోజు

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2017, 11:00 AM



మెహ్రీన్.. నటిగా అంత ప్రతిభావంతమైనది కాకపోయినా, తన క్యూట్ నెస్ తో తెలుగు నాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ. వరస పెట్టి అవకాశాలతో, విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతోంది ఈ ప్రెటీ. కాస్తంత బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు తన హాట్‌నెస్ తో వార్తల్లోకి వస్తోంది. ‘జవాన్’ సినిమా సాంగ్ టీజర్ లో మెహ్రీన్ ను చూసి కుర్రకారు వెర్రెత్తిపోతున్నారు. టీజరే అలా ఉందంటే.. ఆ సినిమా విడుదల అయితే మెహ్రీన్ ప్రేక్షకుల గుండెల్లో గట్టి ముద్రనే వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అదలా ఉంటే.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ లో ఈ హీరోయిన్ ఒక హాట్ పోజును పోస్టు చేసింది. ఇది జవాన్ సినిమా చిత్రీకరణలోనిదే అని స్పష్టం అవుతోంది. అద్భుతమైన సీనరీ, అద్భుతమైన ఫొటో గ్రఫీ, అంతే అద్భుతమైన అమ్మాయి.. ఈ మూడింటినీ కలుపుకున్నట్టుగా ఉన్న ఈ ఫొటో మెహ్రీన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.


మెహ్రీన్ మొహారవిందం ఏమీ చూపకపోయినా.. వెనుకవైపు నుంచి కూడా ఆమె సూపర్ అని, బ్యూట్ ఫుల్ అని, హాట్ అని అంటూ.. ఇంతకు మించిన స్థాయి కామెంట్లతో ఈ హీరోయిన్ ఫాలోయర్లు తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు! 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com