ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆదివారం రాజమౌళి ఏ సినిమా కి వెళ్తుండూ ఆంటీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 04, 2017, 12:02 PM



బాహుబలి సినిమాతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ఇటీవల తన తర్వాతి సినిమాలకి సంబంధించిన వివరాలు వెల్లడించాడు. అయితే ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమాలలో తనకి నచ్చిన సినిమాపై ట్విట్టర్ వేదికగా స్పందించే జక్కన్న ఈ శుక్రవారం రిలీజైన ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎమ్’ మూవీపై ప్రశంసలు కురిపించడమే కాకుండా, టీంకి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుంది. ఈ ఆదివారం టికెట్స్ బుక్ చేసుకున్నామని రాజమౌళి ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే రాజశేఖర్ .. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి. ధన్యవాదాలు సర్ అని ట్వీట్ చేశాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎమ్’ మూవీ తెరకెక్కగా ఇందులో శ్రద్ధా దాస్, పూజా కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ తో అలరించింది. భీమ్స్ సిసిరోలియో , శ్రీ చరణ్ పాకాల ఈ మూవీకి స్వరాలు అందించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com